ETV Bharat / state

అక్రమార్కులపై చర్యలు తప్పవు: జిల్లా రిజిస్ట్రార్‌ మన్మధరావు - వైజాగ్ వార్తలు

తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు విశాఖ జిల్లా రిజిస్ట్రార్‌ మన్మధరావు హెచ్చరించారు.

Visakhapatnam District Registrar Manmatharao
జిల్లా రిజిస్ట్రార్‌ మన్మథరావు
author img

By

Published : Nov 4, 2020, 12:29 PM IST

మోసపూరిత విధానాల్లో రిజిస్ట్రేషన్లకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్‌ మన్మధరావు హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో 25 మంది ఫోన్లు చేసి సమస్యలు విన్నవించారు. అప్పటికప్పుడే కొన్నింటిని పరిష్కరించారు. ఎక్కువ శాతం అక్రమంగా సాగిన రిజిస్ట్రేషన్లపై తెలియజేశారు.

ఫిర్యాదుల్లో కొన్ని ఇలా...

  • గోపాలపట్నం పరిధి యల్లపువానిపాలెంలో సర్వే నంబరు 134/1లోని కొంత ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలతో 2018లో రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ సర్వే నంబరులో సుమారు ఎకరాకుపైగా ప్రభుత్వ స్థలం ఉంది. ప్రైవేటు వ్యక్తులు అందులో కొంత స్థలానికి రిజిస్ట్రేషన్‌ చేయించుకొని మిగిలిన స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ స్థలమని తహసీల్దార్‌ ధ్రువీకరించినా ఆక్రమణలోనే కొనసాగుతుందని స్థానికులు తెలియజేశారు. దీన్నివెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి డాక్యుమెంటును రద్దు చేసి ప్రభుత్వ భూమిని కాపాడతామని రిజిస్ట్రార్‌ మన్మథరావు తెలియజేశారు.

ఇదీ చదవండి:

ఆచార్య కృష్ణమోహన్‌ పునర్నియామకానికి ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.