మత్తు డాక్టర్ సుధాకర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్‌ను మారుస్తూ ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ రాధారాణి నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ రాంరెడ్డి స్థానంలో డాక్టర్ మాధవీలతకు బాధ్యతలు అప్పగించారు. రాంరెడ్డి తనకు సరైన చికిత్స అందించడం లేదని గత కొద్ది రోజులుగా సుధాకర్ చెబుతున్నారు. తనకు ఇస్తున్న మందుల కారణంగా ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన విడుదల చేసిన లేఖల్లో పేర్కొన్నారు.
వెంటనే తనను వేరే ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం సుధాకర్ కేసు విషయంలో సీబీఐ అధికారులు జరిపిన సుదీర్ఘ విచారణలో డాక్టర్ రాంరెడ్డిని సైతం అధికారులు ప్రశ్నించారు. సుధాకర్‌కు అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో డాక్టర్ రాంరెడ్డిని సుధాకర్‌కు చికిత్స అందించే బాధ్యత నుంచి సూపరింటెండెంట్ తప్పించారు.
ఇదీ చూడండి..