కొవిడ్ వ్యాక్సినేషన్‌పై నిర్లక్ష్యం వద్దని విశాఖ జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులకు సూచించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ మరింత విస్తరించకుండా పరిక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రామ,వార్డు స్థాయిలలో తీసుకోవలసిన చర్యలపై మండల స్థాయి అధికారులు, వైద్యాధికారుల సమీక్షలో ఆయన చర్చించారు. వాక్సినేషన్ ఖచ్చితంగా జరిగినపుడు కొవిడ్ వ్యాప్తి తగ్గుతుందని, కరోనా మరణాలు కూడా సంభవించవని తెలిపారు.
ఇదీ చదవండి:
విశాఖ జిల్లాకు ఏడుగురు స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ల నియామకం