ETV Bharat / state

ఉత్త‌మ జిల్లా ఎన్నిక‌ల అధికారిగా వినయ్ చంద్ - ఉత్త‌మ జిల్లా ఎన్నిక‌ల అధికారిగా వినయ్ చంద్

రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ ఎంపికయ్యారు. జనవరి 25 న రాజ్​భవన్ లో నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు.

ఉత్త‌మ జిల్లా ఎన్నిక‌ల అధికారిగా వినయ్ చంద్

author img

By

Published : Jan 22, 2021, 5:51 AM IST

రాష్ట్ర స్థాయిలో ఉత్త‌మ జిల్లా ఎన్నిక‌ల అధికారి అవార్డుకు విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్ వినయ్ చంద్ ఎంపికయ్యారు. రాజ్​భవన్ లో జనవరి 25న నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో అవార్డును స్వీకరించనున్నారు. ఈ మేరకు ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి కార్యాల‌యం ఆహ్వానం పంపింది. కేంద్ర‌ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరచిన కలెక్టర్లను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఎంపిక చేశారు. త‌న నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌తో ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని స‌మ‌ర్ధంగా నిర్వ‌హించడం ద్వారా వినయ్ చంద్ ప్ర‌త్యేక‌త‌ను నిల‌బెట్టుకున్నారు.

రాజ‌కీయ పార్టీల‌తో ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మంపై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చించి వారి స‌హ‌కారంతో జిల్లాలో ఎన్నిక‌ల జాబితా స‌వ‌ర‌ణ‌లు ప‌క‌డ్బందీగా చేశారు. ప్ర‌తి నెల క్ర‌మం త‌ప్ప‌కుండా ఈవీఎంల గోదాముల్ని త‌నిఖీ చేసి ఓటింగ్ యంత్రాల భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించారు, ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హించడం వ‌ల్ల క‌లెక్ట‌ర్ విన‌య్ చంద్ ఈ గౌర‌వానికి ఎంపిక‌య్యారు.

ఇదీ చదవండి:

విశాఖ- సికింద్రాబాద్​ల మధ్య ప్రత్యేక రైళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.