బ్రిటిష్ కాలంలో తొలిసారి గ్రామాల పేర్లు రికార్డు చేశారు. అప్పట్లో జనాభా ఉన్నా.. కాలక్రమంలో వారంతా వేరే గ్రామాలకు తరలిపోయారు. అలా కొన్ని ప్రాంతాలు కనుమరుగయ్యాయి. రెవెన్యూ రికార్డుల్లో గ్రామాల పేర్లు ఉండిపోయాయి. ఇలా ఓట్లులేని చాలా గ్రామాలు విశాఖ జిల్లాలో కనిపిస్తాయి.
* నాతవరం మండలం గుమ్మడికొండ సమీపంలో బురదపల్లి అగ్రహారంలో 450 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఒక్క మనిషీ లేడు.
* నర్సీపట్నం మండలం నీలంపేట సమీపంలోని వీబీ పట్నంలో 300 ఎకరాలు ఉన్నట్లు రికార్డులో ఉన్నా గ్రామం ఎక్కడా కానరాదు.
* మునగపాక మండలం నాగులాపల్లిని అనుకొని అగ్రహారం, గణపర్తి వద్ద చెల్లమల్ల అనే రెవెన్యూ గ్రామాలు పేరుకే ఉన్నాయి.
* బుచ్చెయ్యపేట మండలంలోని పొట్టిదొరపాలెం వద్ద నిమ్మలోవ, లోపూడి వద్ద లూలూరు గ్రామం రికార్డులకే పరిమితం.
* చీడికాడ మండలం చుక్కపల్లి సమీపంలోని సీతారాంపురం, వీరభద్రునిపేటను ఆనుకొని ఉన్న కె.ఎస్.పురం, తునివలస వద్ద టి.బి.పాలెం సైతం అలాంటి గ్రామాలే.
* రావికమతం మండలం మేడివాడ సమీపంలో దిబ్బి, బాదులపాడు, టి.అర్జాపురం వద్ద తామరచెర్ల గ్రామాలు రికార్డులకే పరిమితం
* దేవరాపల్లి మండలం తామరపు సమీపంలో గోడుపాలెం, రాయపురాజుపేట అనే గ్రామం పేరుకే ఉంది.
ఇదీ చదవండి: ఆ కుటుంబాల ఇంటి పేర్లే.. గ్రామ పంచాయతీలు