ETV Bharat / state

CARRIED DEAD BODY IN VISAKHA PATNAM PADERU AGENCY: రోడ్డు మార్గం లేక.. మృతదేహాన్ని 6 కిలోమీటర్లు మోసుకెళ్లారు! - రోడ్డు మార్గం లేక 6 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని మోసుకెళ్లిన గ్రామస్తులు

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో.. రహదారుల దుస్థితికి అద్దం పడుతున్న వార్త ఇది. రోడ్ల అనుసంధానం లేకపోవడంతో.. ఓ మృతదేహాన్ని ఆరు కిలోమీటర్ల మేర (CARRIED DEAD BODY IN VISAKHA PATNAM PADERU AGENCY) మోసుకెళ్లారు. ఇదే మహిళను రెండు రోజుల కిందట చికిత్స నిమిత్తం అదే బాటలో డోలీలో మోసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

CARRYIED DEAD BODY IN PADERU AGENCY
CARRYIED DEAD BODY IN PADERU AGENCY
author img

By

Published : Nov 28, 2021, 9:24 PM IST

Updated : Nov 28, 2021, 10:03 PM IST

ఓ మహిళ మృతదేహాన్ని డోలీలో 6 కిలోమీటర్లు మోసుకెళ్లిన ఘటన.. విశాఖ జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పాడేరు మండలం కాంగుగెడ్డ నుంచి రెండు రోజుల కిందట మూడు నెలల బాలింతకు పక్షవాతానికి గురైంది. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు రహదారి లేకపోవడంతో 6 కిలోమీటర్ల మేర అత్యంత కష్టపడి డోలీలో మోసుకుని, మాడుగుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యవసర చికిత్స నిమిత్తం.. ఆ మహిళను అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్​కు తరలించారు.

రోడ్డు మార్గం లేక 6 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని మోసుకెళ్లిన గ్రామస్తులు

అయితే.. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందింది. అంబులెన్స్​లో మృతదేహాన్ని రహదారి మార్గం వరకు (CARRIED DEAD BODY IN VISAKHA PATNAM PADERU AGENCY) తీసుకొచ్చారు. ఆక్కడి నుంచి వాహనం ముందుకు కదిలే అవకాశం లేకపోవడంతో.. మృతదేహాన్ని చాపలో చుట్టి, కర్రకు కట్టి అత్యంత కష్టం మీద గ్రామానికి చేర్చారు. రోడ్డులేని కష్టాల దారిలో తమ దుస్థితి నిత్యం ఇలాగే ఉంటోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి పాడేరు మండలం దేవాపురం నుంచి మాడుగుల వరకు రహదారి నిర్మించాలని కోరుతున్నారు. తమ గ్రామాలకు చేరుకునేందుకు వీలుగా రోడ్డు మార్గాన్ని నిర్మించాలని, అధికారులు దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:

MOTHER KILLED BABY IN VISAKHAPATNAM: కన్నతల్లి కర్కశత్వం.. నీటి డ్రమ్ములో పడేసి దారుణంగా చంపేసింది

Last Updated : Nov 28, 2021, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.