విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో పేదల కోసం నిర్మించిన గృహాల పట్టాలను ఎంపీ విజయసాయి రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. యలమంచిలి నియోజకవర్గంలో 7,200 ఇళ్ల పట్టాలు ఇచ్చామని విజయసాయి రెడ్డి తెలిపారు. నీతివంతమైన పాలన అందించడమే వైకాపా ప్రభుత్య ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు సమకూర్చాలని సీఎం జగన్ ఆలోచనలో ఉన్నారని విజయసాయి రెడ్డి తెలిపారు.
ఇళ్ల పట్టాలు రానివారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ముత్తంశెట్టి సూచించారు. ఇందుకోసం 90 రోజుల సమయం ఇచ్చారని తెలిపారు. భూ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణ, ఎంపీ సత్యవతి మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చిన మహిళలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ఇదీ చదవండి: పర్యటనపై పోలీసుల ఆంక్షలు... 'వస్తున్నాను' అంటూ పవన్ ట్వీట్