నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో.. గడువు తీరిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు వినియోగించారంటూ బాధితుల కుటుంబీకులు ఆరోపించారు. ఇంజక్షన్‌పై ఒక తేదీ ఉంటే దానిపై మరో తేదీ ఉన్న స్టిక్కర్‌ను అంటించారని ఆరోపించారు.
ఈ విషయమై వైద్యసిబ్బందిని ప్రశ్నిస్తే.. ఇంజక్షన్‌ను వినియోగించే పరిస్థితినిబట్టి 12 నెలల పాటు వినియోగించే గడువు పెంచవచ్చుననే మార్గదర్శకాలు ఉన్నాయని వివరించినట్లు బాధితులు తెలిపారు. గడువు తీరిన ఇంజక్షన్లు వాడిన రోగుల పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో 1.84 కోట్ల మందికి ఇళ్లు కట్టిస్తున్నాం: సీఎం జగన్