ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(vice president venkaiah naidu) ఈ నెల 26న విశాఖకు వస్తునట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. ఆయన నగరంలోనే నాలుగు రోజులు బస చేసే అవకాశముందని చెబుతున్నారు. ఇందుకు తగినట్లు స్థానికంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పర్యటనలో భాగంగా తొలిరోజు విశాఖ పోర్టు ట్రస్టు అధికారులతో ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశముంది. 27న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వేడుకల్లో వర్చువల్ విధానంలో విశాఖ నుంచే పాల్గొంటారని సమాచారం అందినట్లు చెబుతున్నారు. పర్యాటన వివరాల్ని అధికారికంగా నేడు వెల్లడించే అవకాశముంది.
ఇదీ చదవండి