రైతు భరోసా కేంద్రాలకు ప్రభుత్వం పశువైద్య మందులను సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా ఈ మందులు విశాఖ జిల్లా నర్సీపట్నం పశువైద్య కేంద్రానికి చేరుకున్నాయి. వీటిని తొలిసారిగా ఒక్కో మండలంలో రైతు భరోసా కేంద్రాలకు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇక్కడ సిబ్బంది తెలిపారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా కేంద్రాల్లో నియమితులైన పశు వైద్య సిబ్బందికి ప్రాథమిక చికిత్సకు అవసరమైన సుమారు 22 రకాల మందులతో పాటు ఇతర సామగ్రిని అందజేస్తున్నారు. ఏజెన్సీలోని 11 మండలాలతో పాటు మైదాన ప్రాంతానికి సంబంధించి మరో తొమ్మిది మండలాలకు వీటిని కేటాయిస్తామని పశు వైద్య అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: