తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత... మాజీమంత్రి అచ్చెన్నాయుడి సతీమణి విజయమాధవిని కలిశారు. ఆమెకు వంగలపూడి అనిత ధైర్యం చెప్పారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న పాపాలకు మూల్యం చెల్లించుకో తప్పదని వంగలపూడి అనిత పేర్కొన్నారు.
ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణకు సహకరిస్తానని అచ్చెన్నాయుడు అన్నప్పటికీ... ఆయన్ని అరెస్టు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తారనే ఆయన్ను అరెస్టు చేశారని ఆరోపించారు.
ఇదీ చదవండి: పరామర్శించడానికి వెళితే అనుమతి ఇవ్వలేదు: చంద్రబాబు