రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. విశాఖ నగర పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట తెదేపా, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. దిశ చట్టం పేరుకే ఉందని...చట్టం వల్ల మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత ఏంటని అనిత ప్రశ్నించారు. వరుస ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వ స్పందన సరిగా లేదని ఆరోపించారు. అనంతరం సీపీ మనీష్ కుమార్ సిన్హాను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఇదీచదవండి