విశాఖ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. కోవిషీల్డ్, కొవాగ్జిన్ మెుదటి డోసు వేయటంతో పాటు రెండో డోసు కూడా పంపిణీ చేస్తున్నారు. నగరంలోని అన్ని వార్డు సచివాలయాల్లో మహనగరపాలక సంస్థ కొవిడ్ టీకాలు అందిస్తోంది. విశాఖ మేయర్ హరి వెంకట కుమారి స్వయంగా టీకా కేంద్రాలను పరిశీలించారు. కరోనా నుంచి రక్షణకు టీకా మార్గమని అన్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు టీకా పంపిణీ జరిపి ఒక్క రోజులో పది లక్షల మందికి టీకా అందించే మహా యజ్ఞం చేస్తున్నట్లు మహనగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శాస్త్రీ అన్నారు.
ఇదీ చదవండి: