కరోనా రోగులు రోజురోజుకి పెరుగుతున్నప్పటికీ వారికి అవసరమైన ఆక్సిజన్ వెంటిలేటర్లు లేక చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అందుకు భిన్నంగా ఆక్సిజన్ వెంటిలేటర్లు ఉన్నప్పటికీ పాడేరు ఆసుపత్రిలో మాత్రం సిబ్బంది కొరత వేధిస్తూనే ఉంది.
పాడేరు జిల్లా కొవిడ్ ఆస్పత్రిలో 25 వరకు వెంటిలేటర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వీటిని అమర్చేందుకు మత్తు వైద్యానికి సంబంధించి ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అయినా ఇప్పటి వరకూ వివిధ కారణాలతో విధుల్లో చేరలేదు. దీంతో ఇవి అమర్చక.. వివిధ ఆస్పత్రులకు తరలించక నిరుపయోగంగా పడి ఉన్నాయి. వెంటిలేషన్ సదుపాయం అందక నిన్న ఒక్క రోజే ముగ్గురు మృత్యవాతపడ్డారు. ఎన్ని ఏళ్లు గడుస్తున్నా విశాఖ మన్యంలో సిబ్బంది కొరత వేధిస్తోంది.సరిపడా సిబ్బంది లేకపోవడంతో కరోనా టెస్టులు కూడా సకాలంలో చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఏజెన్సీలో కేసులన్నీ పాడేరు ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు.. ఇటువంటి పరిస్థితుల్లో వెంటిలేటర్లు, సిబ్బంది అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని మన్యంవాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి