సెల్ఫోన్ దుకాణం నిర్వాహకునిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగింది. పట్టణంలో స్థానిక పాండురంగ స్వామి దేవస్థానం దుకాణ సముదాయం వద్ద పెంటకోట గ్రామానికి చెందిన సాంబశివరావు సెల్ఫోన్ దుకాణం నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఇనుప రాడుతో దాడి చేసి పరారయ్యాడు. దీంతో సాంబశివరావు తలకు తీవ్ర గాయం అయింది. బాధితుడిని పాయకరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి : త్రిపురాంతకంలో పేకాట శిబిరంపై దాడి