ETV Bharat / state

దేశ అభివృద్ధిలో డీసీఐ కీలకపాత్ర పోషిస్తోంది:కేంద్రమంత్రి సోనోవాల్

దేశ అభివృద్ధిలో డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా, ఆయుష్ శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. విశాఖలోని డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కేంద్రమంత్రి సోనోవాల్
కేంద్రమంత్రి సోనోవాల్
author img

By

Published : Feb 23, 2022, 8:59 PM IST

దేశ అభివృద్ధిలో డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలకపాత్ర పోషిస్తుందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా, ఆయుష్ శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. విశాఖలోని డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత, భవిష్యత్ ప్రాజెక్టులు వాటి పనితీరు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు డీసీఐ ఎండీ డా.జీవీ విక్టర్ తెలిపారు. ముందుగా 'నికార్షన్ సదన్' పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు.

డ్రెజ్జింగ్​కు వినియోగించే షిప్​లను, వాటి చిత్రాలను ఆయన సందర్శించారు. అనంతరం డీసీఐ ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం తరపున డీసీఐకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తామని, అందుకు తగ్గట్టు ఉద్యోగులు కూడా డీసీఐతో పాటు దేశ ప్రగతికి తోడ్పడాలని మంత్రి సోనోవాల్ సూచించారు.

ఇదీ చదవండి: ఆయిల్ పామ్ సాగు పెంచేందుకు ప్రణాళికలు - మంత్రి కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.