విశాఖ రైల్వే జోన్‌పై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక జవాబిచ్చారు. విశాఖ జోన్ ఏర్పాటుకు నియమించిన ప్రత్యేక అధికారి డీపీఆర్ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం డీపీఆర్ రైల్వే శాఖ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. కొత్త జోన్ కార్యకలాపాలు ఎప్పట్నుంచి ప్రారంభించాలో కాలపరిమితి లేదన్నారు. కొత్త జోన్‌లో వాల్తేరు డివిజన్‌ను కలపడంపై అన్నీ పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కొత్త జోన్‌లో వాల్తేరు డివిజన్‌ను చేర్చాలని ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి విజ్ఞప్తులు అందాయని కేంద్ర మంత్రి తెలిపారు. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకునే జోన్ పరిధి నిర్ణయిస్తామని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ.. KDCC: రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన: మంత్రి కన్నబాబు