విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ కు సంబంధించి.. వెలుగు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తి నివారణకు ఉపయోపడే పళ్లను విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు కడప జిల్లా ప్రాంతానికి చెందిన అరటిపళ్ళతో సహా బత్తాయి రకాలను గ్రామీణ ప్రాంతాలకు అందజేస్తోంది. వీటిని తక్కువ ధరకే విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఇందులో భాగంగానే నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ మండలానికి బత్తాయిలను సరఫరా చేస్తోంది. తొలి విడతలో భాగంగా ఒక్క గొలుగొండ మండలానికి సుమారు పది వేల కిలోల బకాయిలను సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: