![uday express trail run successfull](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4130749_udaytrain.jpg)
ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇవాళ వాల్తేరు డివిజన్ అధికారులు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. మర్రిపాలెం కోచింగ్ యార్డ్ నుంచి విజయనగరం వరకు ఇది పట్టాలపై పరుగులు పెట్టింది. ఈ నెల 16 నుంచి ఈ రైలును విశాఖ- విజయవాడల మధ్య నడపనున్నారు. దేశంలోనే ఈ తరహా రైళ్లలో ఇది రెండోది అయినందున రైల్వే మంత్రితో దీనిని ప్రారంభించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. మంత్రికి సమయం కుదరకపోతే ప్రారంభం కొంత వాయిదా పడే అవకాశం ఉంది. ఉదయ్ సర్వీసు ప్రారంభమైతే, రద్దీ విపరీతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల కష్టాలు కొంతమేర తీరే అవకాశం ఉంది.