సారా ప్యాకెట్ల చోరీ ఓ వ్యక్తి ఆయువు తీసింది. విశాఖ జిల్లా చిట్టెంపాడు గ్రామానికి చెందిన ఉడతపల్లి కళ్యాణం అనే వ్యక్తి గత నెల 18న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు గాలించగా.... మరుసటి రోజు గ్రామానికి సమీపంలోని కాలువ వద్ద శవమై కనిపించాడు. మృతుడి కుమారుడు సోమరాజు ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్రలతో కొట్టడం వల్లే కళ్యాణం చనిపోయాడని పోస్టుమార్టం నివేదిక రావడంతో... పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. నిందితులైన మోసా చలపతిరావు, సంపరి కన్నబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ చెప్పారు.
ఇదీ చదవండీ...
ప్రేమోన్మాది చేతిలో బలైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి