TTD Chairman YV Subba Reddy : దిల్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను తితిదే ఛైర్మన్, ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి సమర్థించారు. తమ ప్రభుత్వం గతం నుంచే ఈ విషయాన్ని చెప్తుందని.. విశాఖ గర్జనలో ఇదే చెప్పామని అన్నారు. ఏప్రిల్ నెల వరకు న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకుని, విశాఖలో వీలైనంత తొందరగా పాలన సాగించటానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
విశాఖలో ఎక్కడ ఉంటారన్నది సమస్య కాదన్నారు. పాలన కోసం అవసరమయ్యే భవనాలకు.. ప్రభుత్వ కార్యాలయాలు, ఐటీ భవనాలు, ఉన్నాయని వాటిని వినియోగిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కార్యాలయం, నివాసాలను ప్రభుత్వ అతిథి గృహంలో పెట్టుకుని.. నెమ్మదిగా మిగిలిన ఏర్పాట్లు చేస్తామని సుబ్బారెడ్డి వివరించారు.
"ఎక్కడ ఉంటారు, ఏంటానేది సమస్య కాదు. ఉండటానికి ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. మా ప్రభుత్వం ఇప్పుడే కాదు విశాఖ గర్జన సమావేశం నిర్వహించినపుడే చెప్పింది. ఎన్నో సందర్భాలలో నేను చెప్పాను. మా పార్టీ నాయకులు చెప్పారు. ఏప్రిల్ లోపలే అన్ని న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేసుకుని.. వీలైనంత తొందరగా విశాఖ నుంచి పాలన కొనసాగిస్తాం." -వైవీ సుబ్బారెడ్డి, తితిదే ఛైర్మన్, ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్
ఇవీ చదవండి :