విశాఖకు చెందిన ముగ్గురు టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు... జపాన్లో పదిరోజులపాటు జరగనున్న శిక్షణకు ఎంపికయ్యారు. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో వారిని అభినందిస్తూ.. రోటరీ క్లబ్ నిర్వాహకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ఎడాది 250 మంది క్రీడాకారులతో విశాఖలో నిర్వహించిన టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురిని ఎంపిక చేసినట్లు తెలియజేశారు. ఈనెల 17 నుంచి పదిరోజులపాటు సాగే శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొననుట్లు స్పష్టం చేశారు. పర్యటనకు సంబంధించి క్రీడాకారులకు రోటరీ క్లబ్, ఎల్ ఏంజెల్స్ వాలంటీర్ల సంఘం సహకారంతో 20 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీచదవండి