విశాఖ జిల్లా అనకాపల్లిలో పోలీసు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ పోలీస్ బ్యాండ్ తో ప్రదర్శన నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన రక్షకభటుల త్యాగాలను సిబ్బంది కొనియాడారు. అమరులైన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ పోలీస్ సిబ్బంది ప్రదర్శనలో పాల్గొన్నారు.
అనకాపల్లి పట్టణ ప్రధాన రహదారిలో ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ మళ్ల మహేశ్వర రావు, ట్రాఫిక్, అనకాపల్లి పట్టణ సీఐలు బాపూజీ, భాస్కర్ రావు అనకాపల్లి దిశ, పట్టణ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చదవండి: