విశాఖ జిల్లా...ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో గిరిజనులు ఆందోళనకు దిగారు. బలిమెల జలాశయం వల్ల తమ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని భారీ ర్యాలీ చేపట్టారు. మల్కాన్గిరి జిల్లా పరిధిలోని అయిదు పంచాయతీలకు చెందిన మూడు వేల మందికి పైగా గిరిజనులు ర్యాలీలో పాల్గొన్నారు.
అధికారుల నుంచి స్పందన కరువు
కొన్నేళ్లుగా బలిమెల జలాశయం వల్ల తమ మనుగడ ఇబ్బందికరంగా మారిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా తమ సమస్యలు మీద మల్కాన్గిరి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. తమ సమస్యలను ఒడిశా ప్రభుత్వం పట్టించుకోకపోతే... ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: మావోయిస్టు వారోత్సవాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ర్యాలీ