గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై.. గత 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయంపై ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి.
ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా జీవో నెంబర్ 3ని చట్టబద్ధత చేయాలని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ఉద్యోగ, గిరిజన సంఘాలు కోరుతున్నాయి. జీవో రద్దుతో గిరిజనులు అయోమయంలో పడ్డారని ఆవేదన చెందుతున్నారు. జూన్ 9న జరగబోయే మన్యం బందుకు అందరూ సహకరించాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అప్పలనర్సయ్య కోరారు.
ఇదీ చదవండి: