ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని మాచ్‌ఖండ్ విద్యుత్తు ప్రాజెక్టు సమీపంలోని జోలాపుట్ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో సుమారు 30 కిలోమీటర్లు విశాలమైన నదీ పరివాహక ప్రాంతం ఉంది. ఇదీ ముఖ్యంగా ఆంధ్ర సరిహద్దులో విశాఖ జిల్లా పెదబయలు, ముంచంగిపుట్టు మండలాన్ని తాకుతుంది. స్థానిక గిరిజనులు వందల ఏళ్లుగా చేపలు వేటను జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారు. అయితే ఆర్థిక ఆసరా లేకపోవడంతో వాళ్లు వెనుకబడిపోతున్నామన్నారు. ప్రభుత్వ సాయం లేకపోవడంతో తమ జీవనం ఆగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. తమకు సహాయ సహకారాలు అందించి చేపలు వేటకు మార్గం చూపాలని కోరుతున్నారు.
మైదాన ప్రాంతాలలో మత్స్యకారులకు ప్రభుత్వం అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. కానీ గిరిజన ప్రాంతంలో చేపలు పట్టే వారిని మత్స్యకారులుగా గుర్తించడం లేదు. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేకపోతున్నారు. వలలు, పడవలు ఇచ్చి తమను ఆదుకోవాలి అని గిరిజనులు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి:
ప్రభుత్వమే చేయలేనప్పుడు.. ప్రైవేటు వాళ్లెలా చేస్తారు?: నాదెండ్ల