విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం తారువలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడును చీడికాడ మండలం ఎం.గదబూరు గ్రామానికి చెందిన గిరిజనులు కలిసి పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని కోరారు. పూర్వీకుల నుంచి ఎన్నోఏళ్లుగా పోడు భూములను సాగుచేసుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఆగస్టులో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు.
ఈ క్రమంలో గ్రామంలోని 70 కుటుంబాలకు చెందిన గిరిజనులు 20 ఎకరాలు సాగు చేసుకుంటున్నామన్నారు. తామంతా అర్హులమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాగుహక్కు పట్టాలు మంజూరు చేయించాలని ఎమ్మెల్యేను గిరిజనులు కోరారు. పట్టాలు మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గిరిజనులకు హామీ ఇచ్చారు
ఇదీ చదవండి: 'కొవిడ్ ఆస్పత్రుల సంఖ్య పెంచాలి.. ప్రజల్లో ధైర్యం నింపాలి'