విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని జాలంపల్లి, కూర్మనాధపురం, కృష్ణంపాలెం, గొప్పులపాలెం, బూట్ల జాలంపల్లి, రాయిపాలెం గ్రామాలకు చెందిన ఆదివాసీలు, ఎస్సీలు కలిసి ర్యాలీ నిర్వహించారు. మండలంలోని పలు ప్రాంతాల్లో నిర్వాసితులకు ఇచ్చిన భూముల అన్యాక్రాంతం అవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి అజయ్ కుమార్ అన్నారు. అధికారులే ఆన్లైన్లో రికార్డులు మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి గిరిజనులు, దళితుల సాగులో ఉన్న భూములకు సాగుహక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి