విశాఖ జిల్లా అనకాపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అటవీశాఖ సిబ్బంది, వీఆర్వో... సచివాలయ సర్వేలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని వి.మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, ఎలమంచిలి మండలంలోని కొంత భాగంలో గిరిజనులు నివసిస్తున్నారని ఆర్డీవో సీతారామారావు తెలిపారు.
2005 డిసెంబర్ 13 ముందు నుంచి గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు అటవీ హక్కులు కల్పించేలా సెప్టెంబర్ 1 నుంచి సర్వే చేస్తామని పేర్కొన్నారు. 15 వ తేదీలోగా భూములసర్వేతో పాటు గ్రామ సభలు పూర్తి చేసి, డివిజన్ కమిటీకి, జిల్లా కలెక్టర్కు నివేదిక పంపుతామని వివరించారు. అక్టోబర్ 2న భూమి హక్కులు పత్రాలు అందజేస్తామని ఆర్డీవో వివరించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని సిబ్బందికి చోడవరం ఫారెస్ట్ రేంజర్ రాంనరేష్ అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: