రోలుగుంట మండలంలోని ఆర్ల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 67లో సుమారు 18 ఎకరాల భూములను ఆదివాసి కుటుంబాలకు గతంలో ప్రభుత్వం కేటాయించింది. వారంతా ఆ భూమిలో జీడి మామిడి ఇతర పండ్ల తోటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఈ పాస్ పుస్తకాలు కూడా మంజూరు చేశారు. ఈ భూములు ఆధారంగా బ్యాంకుల్లో రుణాలు కూడా పొందారు. మరో పక్క ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా వంటి రాయితీలను పొందుతున్నారు.
ఇటీవల కాలంలో అధికారులు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆయా భూములకు సంబంధించిన సర్వే నెంబర్లతో పట్టాలు మంజూరు చేశారని ఆరోపిస్తున్నారు. వెబ్ ల్యాండ్ లో కూడా తమ పేర్లు నమోదు చేశారని, దీని వెనుక జరిగిన అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలంటూ భూముల్లోనే గిరిజనులు నిరసనకు దిగారు. తమకు న్యాయం జరగకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం, నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
ఇవీ చూడండి...