ETV Bharat / state

విశాఖ సాగర తీరంలో.. కోనసీమ అందాలు

సాగర తీరం కోనసీమను తలపిస్తోంది. చెట్ల నీడన సేద తీరుతూ అలల హోరును సందర్శకులు ఆస్వాదిస్తున్నారు. విశాఖ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బీచ్​లో ఏడాదిగా అందరినీ ఇసుక తిన్నెలపై చెట్లు ఆకర్షిస్తున్నాయి.

విశాఖ సాగరతీరంలో కోనసీమ అందాలు
author img

By

Published : Jun 20, 2019, 6:31 PM IST

విశాఖ సాగరతీరంలో కోనసీమ అందాలు

విశాఖ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్కే బీచ్. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను తన సహజ అందాలతో ఇట్టే కట్టి పడేసే ఆర్కే బీచ్ అందాలను... ఇసుక తిన్నెలపై ఏర్పాటు చేసిన కొబ్బరి చెట్లు రెట్టింపు చేశాయి.

సాగర తీర ప్రాంతంలో కొబ్బరి చెట్లను... అదీ ఇసుక తిన్నెలపై నిలబెట్టి బతికించడం అంటే సామాన్యమైన విషయం కాదు. భోగాపురం ప్రాంతం నుంచి చెట్లు తీసుకువచ్చి పర్యావరణ ప్రేమికుడు రాజాబాబు ఇసుకపై నిలబెట్టారు. తేమ గాలితో చెట్లకు ఎదురయ్యే ఇబ్బందుల్ని గుర్తించిన ఆయన... జాగ్రత్తలు తీసుకుని వాటిని జీవంతో నిలిచేలా చేశారు. విదేశీ పరిజ్ఞానంతో ఇసుక తిన్నెల కింది నుంచి నీరందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇటీవల చెట్ల మధ్య రాతి బల్లలు ఏర్పాటు చేశారు. వేసవి ఎద్దడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు సాగర తీరానికి వచ్చే సందర్శకులు ఇప్పుడు ఈ చెట్ల నీడకు చేరుకుంటున్నారు.

విశాఖ ఆర్కే బీచ్ పొడవునా సుమారు 6 వందల కొబ్బరి చెట్లను వివిధ చోట్ల నిలబెట్టారు. బీచ్​లో ఇలా కొబ్బరి చెట్లను చూడడం ఆనందంగా ఉందని సందర్శకులు అంటున్నారు.

Intro:కిట్ నం: 879, విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.

( )యోగ ఒక జీవన విధానమని హెచ్ పి సి ఎల్ ల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ గోయల్(ముంబై) అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సహజ రాజయోగ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గా వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజీవ్ గోయల్ ప్రసంగించారు. మనిషిలోని శక్తిని యోగ ప్రక్రియ ద్వారా సద్వినియోగపరుచుకోవాలి వచ్చునని స్పష్టం చేశారు.

Body:బ్రహ్మకుమారీస్ రామ అక్కయ్య మాట్లాడుతూ సహజ రాజ యోగ ద్వారా మనిషిలోని శారీరక, మానసిక రుగ్మతలను నియంత్రించవచ్చని అన్నారు. 21 తేదీ నుంచి మూడు రోజుల పాటు సహజ రాజ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో లో వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం కోశాధికారి నాగరాజు పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

బైట్: రజీవ్ గోయల్, చీఫ్ జనరల్ మేనేజర్, హెచ్.పి.సి.ఎల్.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.