ETV Bharat / state

Trained Dogs Acrobatics: ఏవోబీ సరిహద్దులో అలరించిన శునకాల విన్యాసాలు - దేశరక్షణలో శునకాలు

Trained Dogs Acrobatics: దేశరక్షణలో శునకాలు పాత్ర కూడా ఎంతో గొప్పది. దేశం కోసం అవి ప్రాణాలను అర్పించిన సందర్భాలు అనేకం. అవి ఎలా పని చేస్తాయి. ఆపదలను ఎలా పసిగడతాయి అనే అంశాలపై ఏవోబి సరిహద్దు ప్రాంతంలోని జయపురం సెయింట్ క్జావియర్ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు బీఎస్​ఎఫ్​ బలగాలు వివరించాయి. ఈ సందర్బంగా శునకాల విన్యాసాలు అందరినీ అలరించాయి.

Trained Dogs Acrobatics
దేశరక్షణలో శునకాల సేవల ప్రదర్శన..
author img

By

Published : Feb 3, 2022, 9:52 PM IST

Trained Dogs Acrobatics: దేశరక్షణలో భాగంగా భద్రతా బలగాలకు తర్ఫీదు పొందిన శునకాలు సాయమందిస్తాయన్న విషయం మనకు తెలుసు. మాటలు రాని మూగజీవులు సైతం దేశం కోసం ప్రాణాలను అర్పించిన సందర్భాలు అనేకం. అవి ఎలా పనిచేస్తాయి. ఆపదలను ఎలా పసిగడతాయి అనే అంశాలపై ఏవోబి సరిహద్దు ప్రాంతంలోని జయపురం సెయింట్ క్జావియర్ పాఠశాల ప్రాంగణంలో ప్రజలకు వివరించాయి బీఎస్ఎఫ్ బలగాలు.

దేశరక్షణలో శునకాల సేవల ప్రదర్శన..

కోరాపుట్‌ బీఎస్‌ఎఫ్‌ బలగాల ఆధ్వర్యంలో మొత్తం పది శిక్షణ పొందిన జర్మన్‌షెపార్డ్‌, ల్యాబ్‌రేడర్‌, రెట్రివర్‌, బెల్జియన్‌షెపార్ఢ్‌ జాతుల శునకాలు, వాటి శిక్షణ దారులతో కలిసి విన్యాసాలు చేశాయి. బీఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ సజ్జన్‌సింగ్‌పన్వర్‌ భద్రత బలగాలు దేశ భద్రతలో ఏ విధంగా కాపాల కాస్తుంటారో విద్యార్థులకు వివరించారు. కూంబింగ్‌ సమయంలో, మాదక ద్రవ్యాల రవాణా అరికట్టడానికి, ముద్దాయిలను పట్టుకోవడంలో ఈ తర్ఫీదు పొందిన శునకాలు భద్రతా బలగాలకు ఏ విధంగా సహాయపడతాయో తెలియజేశారు. వాటి క్రమశిక్షణ గురించి వివరించారు. ఈ కార్యక్రమం చూసిన విద్యార్థులతోపాటు పెద్దలు కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవడంతో పాటుగా.. శునకాల విన్యాసాలు చూసి ఎంతో ఆనందించారు.

ఇదీ చదవండి : Mantralayam Temple: మంత్రాలయంలో కొత్త సొబగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.