నాటు పడవ బోల్తా.. ఇద్దరు మృతి - visakha latest news
వణుగుమ్మ పంచాయతీ పరిధిలోని పనస సమీపంలోని మత్స్యగెడ్డలో నాటుపడవ బోల్తా పడి ఇద్దరు మృతిచెందారు. ఈదురు గాలులకి పడవ బోల్తాపడి ముగ్గురు మునిగిపోయారు. వారిలో ఓ వ్యక్తి ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డాడు.

నాటుపడవ బోల్తా పడి ఇద్దరు మృతి
ముంచంగిపుట్టు మండలంలోని వణుగుమ్మ పంచాయతి పనస సమీపంలో శనివారం సాయంత్రం మత్స్యగెడ్డలో నాటుపడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. వణుగుమ్మకు చెందిన బొడా నాయక్ దాసు 27, నాయకం సోమ 40, కిరసాని దైతరి కలసి సరిహద్దులోని ఒడిశా కిచోబ్ గ్రామానికి బయలు దేరారు.
పనస నుంచి నాటు పడవ బయలుదేరింది. ఈదురు గాలులకి పడవ బోల్తాపడి ముగ్గురు మునిగిపోయారు. దైతరి కిరసాని ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డాడు. మిగిలిన ఇద్దరు మృతి చెందారు. ఈ విషయం తెలిసి సమీప గ్రామాల వారు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు మృతదేహాలను వెలికి తీశారు.