PM Narendra Modi: ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అక్కయ్యపాలెం నుంచి మద్దిలపాలెం వరకు సుమారు 5 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోదీ సభకు నగరం నుంచేకాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భారీగా బస్సులు తరలిరావడంతో జాతీయరహదారి మొత్తం బస్సులు, ఆటోలతో నిండిపోయింది. సభ ముగిశాక, బయటకు వచ్చే జనం నేరుగా హైవే మీదకు చేరుకోవడంతో ట్రాఫిక్ ను నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. కొన్ని బస్సులను ఏయూ హాస్టల్ మైదానంలో పార్కింగ్ చేశారు. ఆ బస్సులు సభ ముగిసే సమయానికి రోడ్డుమీదకు వచ్చేశాయి. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చదవండి: