ETV Bharat / state

జలపాతం జోరులో.. పర్యటకుల హోరు - visakha Kottapalli water Falls latest news update

కరోనా కోరల్లోంచి బయటపడుతూ.. ఇప్పుడిప్పుడే పర్యటకం పుంజుకుంటోంది. ఇందుకు తోడుగా కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు జలకళ సంతరించుకున్నాయి. ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన జనం.. ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఇలా వచ్చే పర్యటకులను సరికొత్త అందాలతో ఆకర్షిస్తోంది కొత్తపేట జలపాతం.

Kottapalli water Falls
కొత్తపల్లి జలపాతానికి పర్యాటకుల తాకిడి
author img

By

Published : Nov 23, 2020, 2:25 PM IST

కొత్తపల్లి జలపాతానికి పర్యాటకుల తాకిడి

విశాఖ మన్యం అందాలు పర్యటకులను ఆకర్షించటంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. అలాంటి మన్యం అందాలకు జలపాతం హోరు జోడీ కావడం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. విశాఖ మన్యంలోని జి.మాడుగుల మండలం చింతపల్లి వెళ్లేదారిలో ఉందీ కొత్తపల్లి జలపాతం. అందులోనూ ఆదివారం సెలవు రోజు కలిసి రాగా.. జలపాతాన్ని చూసేందుకు పర్యటకులు పోటెత్తారు.

చింతపల్లి మండలం లంబసింగి చూసిన పిదప పర్యటకులు ఇక్కడ జలపాతం వద్ద సేదతీరేందుకు వస్తుంటారు. ఐదేళ్ల కిందట ప్రభుత్వం కోటి రూపాయల ఖర్చుతో జలపాతాన్ని అభివృద్ధి చేసింది. ప్రమాద రహితంగా తీర్చిదిద్దిన ఫలితంగా.. పర్యటకుల తాకిడి మరింత ఎక్కువైంది. ఎత్తైన కొండ నుంచి జాలువారే నీటి ప్రవాహం.. వీక్షకులను కట్టిపడేస్తుంది. ఈ ఉత్సాహంలో.. పర్యటకులు నీటిలో కేరింతలు కొడుతూ.. సెల్ఫీలు దిగుతున్నారు.

ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి పర్యటకం బయటపడుతున్న తరుణంలో.. ఇక్కడికి వచ్చేవారు కోవిడ్ నిబంధనలు పాటించేలా స్థానికులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ఒక కార్యవర్గంగా ఏర్పడ్డారు. పర్యటకులకు కోవిడ్​పై అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:

శివనామస్మరణతో మారుమోగిన అనకాపల్లి ఆలయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.