అరకు లోయను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.156 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించారు. అరకు లోయ నుంచి లంబసింగి వరకు పలు పనులను చేపడుతున్నామన్నారు. గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గిరిజన విశ్వవిద్యాలయం ,వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. గిరిజనులకు ఎంతో ఆవేదనకు గురి చేస్తున్న బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. పర్యాటక శాఖలోని ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులకే ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి ,చిట్టి ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.గరుడవాహన సేవకు.. తితిదే అనూహ్య ఏర్పాట్లు