ETV Bharat / state

పర్యాటక స్వర్గధామం విశాఖ మన్యం..ప్రత్యేకతలు ఏంటంటే

ఆంధ్రాలో పర్యాటకం అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విశాఖ. శీతాకాలం వస్తే.. ఇక్కడ ప్రకృతి అందాలు చూసేందుకు రా రమ్మని పిలుస్తాయి. ఒక్కసారి విశాఖలోని సందర్శనీయ ప్రాంతాల్లో అడుగు పెడితే.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. కానీ కొవిడ్ కారణంగా ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించేవారు లేరు. ఇంతకీ ఈ సీజన్​లో విశాఖలో మనసును కట్టిపడేసే పర్యాటక ప్రాంతాలు ఏముంటాయి? ఎందుకు పర్యాటకం ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తోంది?

పర్యాటక స్వర్గధామం.. విశాఖ మన్యం..!
పర్యాటక స్వర్గధామం.. విశాఖ మన్యం..!
author img

By

Published : Dec 5, 2020, 7:25 PM IST

పర్యాటక స్వర్గధామం.. విశాఖ మన్యం..

ఆ మన్యం కశ్మీర్, ఊటీ అందాలను తలపిస్తుంది. ఆ తీరం అంతర్జాతీయ బీచ్​లకు దీటుగా ఉంటుంది. ఓ వైపు నీలి సముద్రం... మరోవైపు పచ్చని హరిత హారం. మైదాన ప్రాంతంలో సింహాచలం... మన్యం కొండలపై మోదకొండమ్మ. ఓ వైపు యుద్ధ విమానం.. మరోవైపు జలాంతర్గామి. విశాఖ జిల్లా పర్యాటక స్వర్గధామం. నర్సీపట్నం నుంచి వెళితే చింతపల్లి... ఆ మార్గంలో మంచు తెరలు అసలు ఊటీలో తిరుగుతున్నామా? అనిపించాల్సిందే. పర్యాటక ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే లంబసింగి ఇక్కడిదే. జీరో డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన ప్రదేశం ఇది. అందుకే నవంబరు నుంచి జనవరి వరకు ఇక్కడికి సందర్శకులు ఎంతో ఆత్రుతగా వస్తారు. ఎన్నో అంచనాలతో వచ్చిన వారంతా అంతకుమించిన ఆశ్చర్యాన్ని, అనుభూతిని పదిలంగా తీసుకువెళ్తారు.

ఎన్నో వింతలు..

ఇక వడ్డాది మాడుగులలో హల్వా రుచి చూసి అలా మన్యం కొండలు ఎక్కితే పాడేరును సందర్శించవచ్చు. గిరి కొండల్లో నివసించే ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారు దేవాలయం ఇక్కడ ప్రసిద్ధి. ఈ చుట్టు పక్కల ప్రాంతాలను సందర్శించే ప్రజలు ముఖ్యంగా మోదకొండమ్మ తల్లిని దర్శించుకునే వెళ్తారు. విశాఖ మీదుగా కాశీపట్నం చేరుకుని అలా పచ్చని కొండల అందాల్ని చూస్తూ ఊటీ తరహా వంపుల రహదారులపై పయనిస్తూ వెళితే ఆంధ్రా కశ్మీరం పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో వింతలు అడుగడుగునా తారస పడతాయి. గాలికొండ, సుంకరమెట్ట వ్యూ పాయింట్స్ సందర్శకులకు అందాలు ఎంతగా రంజింపజేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అరకు కాఫీ సువాసనలు అద్భుతం

తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తు నమోదు చేసిన పర్వతాలు విశాఖ జిల్లాలోనే ఉన్నాయంటే ఇక్కడి ప్రకృతి రమణీయత ఎంత గొప్పగా ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు తూర్పు గోదావరి జిల్లా మన్యం... మరోవైపు ఒడిశా అడవులు... ఇంకోవైపు ఛత్తీస్​గఢ్​ అరణ్యం మధ్య ఉండే విశాఖ మన్యం అందానికే కాదు.. అనేక ప్రత్యేకతలకు ప్రసిద్ధి. దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని గడిస్తున్న కాఫీ తోటలు.. అదే మన అరకు కాఫీ సువాసనలు ఓ విలువైన పర్యాటక ఆకర్షణ. మంచుదుప్పటిలా కమ్మేసే చలిగాలిలో ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ అరకు కాఫీ తాగుతుంటే ఆ క్షణం ఎంతో అద్భుతంగా ఉంటుంది.

వలిసే పూల సోయగాలు

ఆ జ్ఞాపకం ఎంత పదిలంగా నిలుస్తుందనే విషయం విశాఖ అందాలు వీక్షించిన ప్రతి ఒక్క పర్యటకుడికీ తెలుస్తుంది. అంతేనా ప్రత్యేకించి ఈ సీజన్​లో ఎక్కడెక్కడి వారినో ఆకట్టుకునే మరో మన్యం ఆకర్షణ వలిసె పూల సోయగాలు. చలికాలం వస్తే విశాఖ మన్యం అందాలకు హద్దే ఉండదని చెప్పడానికి నిదర్శనం ఈ వలిసె పూలే. పసుపు రంగులో ఉండే వలిసెలు అలా గాలికి కదులుతూ ఉంటే మనసు వాటితో పాటే తేలుతూ వెళ్లిపోతుందంటే అతిశయోక్తి కాదేమో. సాధారణంగానే సందర్శకుల్ని అబ్బురపరిచే అరకు అందాలను ఎన్నో రెట్లు గొప్పగా చూపించే వలిసె పూలు చలికాలంలోనే వికసిస్తాయి. చలికాలం దాటితే వలిసెల అందాలను చూసి మురిసిపోదామనుకునే వారికి ఆ అనుభవం దక్కదు. అందుకే ఈ పర్యాటక సీజన్​కు వలిసెలు మరో ప్రధాన ఆకర్షణ.

రెండు కళ్లు సరిపోవు..

విశాఖ అరకు రైలు ప్రయాణం, లోయ ప్రాంతాలు, నిమిషానికి ఓసారి పలకరించే చీకటి గుహలు, అక్కడక్కడ దర్శనమిచ్చే జల పాతాలు, సెలయేళ్ల చప్పుళ్లు ఇలా అరకు లోయకు వెళ్లే మార్గం విశాఖ మన్యం పర్యాటకానికి వెన్నెముక. ఇక భౌగోళిక అద్భుతం బుర్ర గుహల గురించి వేరుగా చెప్పాలా? ప్రకృతి ప్రసాదించిన వరంగా సహజసిద్ధంగా ఏర్పడ్డ శిలాజాల అద్భుత దృశ్యాల్ని వీక్షించేందుకు రెండుకళ్లు సరిపోవనే చెప్పాలి. డుడుమ, కటిక, చాపరాయి వంటి అనేక జలపాతాలు ఉన్నాయి. ఇలా విశాఖ మన్యం పంచే ఆహ్లాదం గురించి ఎంత చెప్పినా తక్కువే.

రుషికొండ బీచ్ అదుర్స్

మన్యం ఇలా పర్యాటక రారాజుగా విశాఖ జిల్లాకు వన్నె తెస్తే... మైదాన ప్రాంతంలోనూ ఎన్నో ఆకర్షణలు సందర్శకుల మనసుల్ని దోచుకుంటాయి. అందులో ఏ ఒక్కరికీ పరిచయం అవసరం లేనిది సాగర తీరం. ఆర్కే బీచ్, యారాడ బీచ్, భీమిలి బీచ్.. ఈ సీజన్​లో పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటాయి. విశాఖ తీరం వెంబడి ఉండే బీచ్​లలో ఈ ఏడాది అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బీచ్ సైతం ఉంది. బ్లూ ఫ్లాగ్ స్థాయిని దక్కించుకున్న రుషికొండ బీచ్ అది. ప్రపంచవ్యాప్తంగా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్​గా రుషికొండ నిలిచింది.

ఔరా అనాల్సిందే..

భౌగోళిక వారసత్వ సంపదకు విశాఖలో కొదవేలేదు. ఎర్రమట్టి దిబ్బలు విజ్ఞానాన్ని పెంచే పర్యాటక ప్రదేశం. ఇక్కడ సహజసిద్ధంగా ఎర్రమట్టితో ఏర్పడిన దిబ్బల్ని చూసినా.. వారెవరైనా ఔరా అనాల్సిందే. శాస్త్రీయ దృక్పథం కలిగిన వారికి ఇక్కడ తెలుసుకునేందుకు ఎన్నో విషయాలు ఉంటాయి. అందుకే జీఎస్ఐ గుర్తింపును సైతం ఈ ప్రదేశం దక్కించుకుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ద్వారం తీరం మరో ఆకర్షణ. ఇసుక తిన్నెల నడుమ సాగరానికి స్వాగతం అన్నట్లు రాతితో ఏర్పడిన ద్వారాన్ని పర్యాటకులు ఎంతో ఆసక్తిగా గమనిస్తుంటారు.

బౌద్ధ క్షేత్రం అద్భుతం

బౌద్ధ క్షేత్రాల విషయంలో విశాఖ జిల్లాకు ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. బౌద్ధ భిక్షువుల ఆవాసాలు ఇక్కడ నెలకొన్న తీరు, వాటి విశేషాలు చారిత్రక ఆసక్తి ఉన్న వారిని ఎంతో ఆకట్టుకుంటాయి. తొట్లకొండ, బావి కొండ, పావురాల కొండ సాగర తీరం వెంబడి.. పచ్చని ఎత్తైన కొండలపై ఉంటాయి. అక్కడికి వెళితే వేల సంవత్సరాల చరిత్ర కళ్లముందు కదలాడుతూ ఉంటుంది. ఇక ప్రకృతిని ఆరాధించే వారికి ఈ బౌద్ధ క్షేత్రాలు అందించే ఆనందాన్ని ఎంతో గొప్పగా వర్ణించవచ్చు. బౌద్ధ భిక్షువులు ఆ కాలంలో ఏర్పాటు చేసుకున్న తొట్టెలు, స్థూపాలు, వారు నిర్మించుకున్న వంటశాలల ఆనవాళ్లు, వారు ప్రార్థన చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రదేశాల్ని చూస్తూ అలా సముద్రం వైపు కళ్లు తిప్పితే కనిపించే ప్రకృతి సొబగులు ఎంతో ఆనందాన్నిస్తాయి.

కరోనా రక్కసితో.. విల విల

ఈ ఏడాది కరోనా రక్కసి సృష్టించిన దుస్థితి కారణంగా పర్యాటక మణిహారంగా వెలుగొందిన విశాఖ ప్రస్తుతం వెలవెలబోతోంది. ఈ రంగంపై ఆధారపడిన ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పర్యాటకాన్ని నమ్ముకుని స్వయం ఉపాధిపై బతికే వారి సంగతి వేరుగా చెప్పనక్కర్లేదు. గతేడాదితో పోల్చితే పర్యాటకుల సంఖ్య 60 శాతానికి పైగా తగ్గిపోతుంది. కొవిడ్ నిబంధనలు సడలించినా.. నేటికీ పర్యాటకానికి అనుకున్న స్థాయి ప్రోత్సాహం దక్కడం లేదు. ప్రభుత్వంనుంచి పర్యాటకుల్ని ఆకర్షించే దిశగా చెప్పుకోదగిన ప్రయత్నాలైతే జరగడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

ప్రభుత్వం చొరవ చూపాలి

సాహస క్రీడలకుఎంతో ప్రత్యేకంగా నిలిచే విశాఖలో నేటికీ పర్యాటక పాలసీ రాకపోవడం కారణంగా వాటి ఊసే ఎక్కడా వినిపించడం లేదు. అసలే చతికిలపడి ఉన్న పర్యాటక రంగానికి ప్రస్తుత సీజన్ కాస్తంత అయినా ఉత్సాహాన్ని ఇస్తుందనే అంచనాలు తలకిందులయ్యేలా ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపించి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ఈ రంగంపై ఆధారపడిన వారు కోరుతున్నారు.

పర్యాటకంపై ప్రచారం చేపట్టాలి

ఏటా ఫిబ్రవరి వరకు విశాఖకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమబంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ సీజన్ కు ఎంతో కీలకం. రాష్ట్రంలో అమలవుతున్న కొవిడ్ నిబంధనలు, తగ్గుముఖం పడుతున్న కొవిడ్ కేసులకు సంబంధించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా చొరవ చూపించి ఆయా రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తే పర్యాటకాన్ని ఆకట్టుకోవడానికి అవకాశముంటుంది. ఇప్పటికే కొవిడ్ కారణంగా గత 8 నెలలుగా ఈ రంగంపై ఆధారపడిన వారు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. వచ్చే మూడు నెలలైనా వీలైనంత మేరకు పర్యాటకులను ఆకట్టుకోగలిగితే ఈ రంగంలో ఉన్న వారికి కాస్త ఊరట లభించే అవకాశం ఉంది. దీనిపైప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి: సాగు చట్టాల్లో సవరణలకు కేంద్రం ఓకేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.