ETV Bharat / state

Tomatoes On Subsidy: రాయితీపై టమాటా.. మార్కెట్లకు భారీగా జనం.. చివరకు నిరాశే

Subsidy On Tomatoes: రాయితీ మీద ఇస్తున్న టమాటా వినియోగదారులకు గలాటాను మాత్రమే మిగులుస్తోంది. రాయితీ మీద ఇస్తున్న టమాటాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జనాలు మార్కెట్ల ఎదుట బారులు తీరారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచే క్యూలైన్లలో నిల్చున్న వినియోగదారులు కౌంటర్ల వద్దకు చేరుకునే సరికి వారికి నిరాశే ఎదురవుతోంది.

public problems for subsidy tomatos
public problems for subsidy tomatos
author img

By

Published : Aug 3, 2023, 9:18 PM IST

50 రూపాయలకే కేజీ టమాటా

Subsidy On Tomatoes In Ap: రాష్ట్ర మార్కెటింగ్​ శాఖ రాయితీ మీద ఇస్తున్న టమాటా వినియోగదారులకు గలాటాను మాత్రమే మిగులుస్తోంది. 'ఓ స్త్రీ రేపు రా' అన్నట్లు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి క్యూలైన్లలో నిల్చున్న వినియోగదారులు కౌంటర్ల వద్దకు చేరుకునే సరికి వారికి నిరాశే ఎదురవుతోంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు టమాటా పంపిణీ ఓ సవాలుగా మారుతోంది.

విశాఖ కంచరపాలెం రైతుబజార్ వద్ద రాయితీ టమాటాల కోసం మహిళలు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిల్చుని ఉన్నారు. మండే ఎండలో గంటల తరబడి నిల్చున్నప్పటికి టమాటాలు దొరకకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రేషన్ షాపుల వద్దేకే ఈ రాయితీ టమాటాలను పంపిణీ చేసే విధానాన్ని అమలు చేస్తే.. ఇన్ని ఇక్కట్లు పడే అవసరం ఉండదు కదా అని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్ల వృద్ధుల నుంచి అన్ని వయసుల వారు గంటల తరబడి రైతు బజార్ల వద్ద క్యూలైన్లలో నిలబడినప్పటికీ రాయితీ టమాటాలు దొరుకుతాయన్న గ్యారెంటీ లేకుండా పోతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా తమ బాధను అర్ధం చేసుకుని సంబంధిత శాఖాధికారులు ఆయా ప్రాంతాల్లోని రేషన్ షాపుల వద్దే టమాటాను విక్రయించాలని మహిళా వినియోగదారులు కోరుతున్నారు. రాయితీ టమాటాలను పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Subsidy Tomatoes in AP అక్కడ టమాట కిలో రూ.50 లే..! రైతు బజారుకు క్యూ కట్టిన జనాలు..!

ధర ఆకాశాన్నంటుతున్న వేళ కర్నూలు రైతుబజార్​లోనూ టమాటాల కోసం జనం పోటెత్తారు. బహిరంగ మార్కెట్​లో రూ.150 కిలో ఉండగా రైతుబజార్​లో రాయితీ ధరపై రూ.50కే కిలో టమాటా విక్రయించడంతో ప్రజలు భారీగా స్థానిక మార్కెట్​కు తరలివచ్చారు. ఉదయం నుంచి క్యూలైన్​లో నిల్చుని చాలా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు వారి ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల పక్కనే టమాటా కోసం క్యూలైన్ ఏర్పాటు చెయ్యడంతో అక్కడి నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నామని వారు వాపోయారు.

Tomatos on Subsidy: రూ 50కే కేజీ టమాటా.. క్యూ కట్టిన జనం.. ఎక్కడంటే..!

ధరలు పెరిగిపోయి కొండెక్కిన టమాటాలను సబ్సిడీపై ఇస్తుండటంతో దాని కోసం కడపలోను జనం బారులు తీరారు. కడపలోని స్థానిక రైతు బజార్‌లో.. రూ.50 కిలో టమాటా విక్రయాలను గురువారం నుంచి ప్రారంభించారు. సబ్సిడీపై ఇచ్చే టమాటాలను కొనుక్కునేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన జనం కిలోమీటర్ల కొద్ది బారులు తీరారు. చిన్న పెద్ద తేడా అని లేకుండా కుటుంబంలోని అందరూ టమాటాల కోసం క్యూలో నిలబడుతున్నారు. ఆధార్ కార్డు చూపించిన వారికి కూడా కిలో టమాటాలు మాత్రమే ఇస్తున్నారు.

Tomato Rate record in Madanapalle: మదనపల్లె మార్కెట్‌లో రికార్డ్​.. డబుల్​ సెంచరీకి చేరువలో టమాటా ధర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.