రాజకీయ నేపథ్యం లేని తనకు అత్యున్నత పదవి ఇచ్చినందుకు పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్య దర్శి లోకేశ్ కు టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను పార్టీ తనకు అప్పగించిందన్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తానని ప్రణవ్ గోపాల్ తెలిపారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ప్రణవ్ గోపాల్ అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన తనకు కీలక పదవి ఇచ్చినందుకు పార్టీ పెద్దలకు ప్రణవ్ గోపాల్ ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చదవండి: విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్... ఇద్దరు మృతి