విశాఖ జిల్లా కశింకోటలో నాటుసారా అనుకొని స్పిరిట్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. శనివారం రాత్రి ఐదుగురు వ్యక్తులు కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఇవాళ ఉదయం లేచే సరికి ఆనంద్, నూకరాజు అనే ఇద్దరు మృతిచెందగా...అప్పారావు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అప్పారావు మృతి చెందాడు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మద్యం సీసాను పరిశీలనకు పంపించగా...సర్జికల్ స్పిరిట్‌గా గుర్తించినట్లు అనకాపల్లి గ్రామీణ సీఐ నరసింహరావు తెలిపారు.
ఇదీ చదవండి..