ETV Bharat / state

విశాఖలో చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం... ముగ్గురు మృతి - three students death at pp agraharam

Three killed in two-wheeler collision with tree in Visakhapatnam
ముగ్గురు పదో తరగతి విద్యార్థులు మృతి
author img

By

Published : Mar 21, 2021, 7:35 AM IST

Updated : Mar 21, 2021, 9:25 AM IST

07:33 March 21

ముగ్గురు పదో తరగతి విద్యార్థులు మృతి

విశాఖ జిల్లా మాకవరపాలెం సమీపంలోని పీపీ అగ్రహారం వద్ద  ఘోరరోడ్డు ప్రమాదం  జరిగింది.  ఈ ప్రమాదంలో  పదవ తరగతి చదువుతున్న ముగ్గురు  విద్యార్థులు మృతి చెందారు. మాకవరపాలేనికి చెందిన ఆర్ హేమంత్ అనే విద్యార్థి ఇంట్లో శుభకార్యం కోసం.. తన స్నేహితులైన అనీష్ , హర్షిత్​తో కలిసి  హేమంత్ ద్విచక్రవాహనంపై శనివారం అర్ధరాత్రి గ్రామానికి పయనమయ్యారు. పీపీ అగ్రహారం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ  ఘటనలో  హేమంత్ అక్కడికక్కడే మృతిచెందాడు.  అనీష్, హర్షిత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మాకవరపాలెం పోలీసులు  కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాలను నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:  వాహనం అదుపుతప్పి ఒకరు.. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ మరొకరు..

Last Updated : Mar 21, 2021, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.