ETV Bharat / state

కొవిడ్ విజేతలు.. క్షేమంగా ఇంటికి చేరుకున్నారు - covid recovers

ఆ కుటుంబానికి కరోనా వైరస్ సోకింది. వీరందరు కొవిడ్ కేంద్రంలో చికిత్స తీసుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇదీ కొవిడ్ ను జయించిన ఓ కుటుంబం గాధ.

vishaka district
వీరు కొవిడ్ విజేతలు.. క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.
author img

By

Published : Jul 26, 2020, 4:32 PM IST

విశాఖ జిల్లా చోడవరం పట్టణానికి చెందిన పూసర్ల సతీష్ అతని భార్య పద్మ, కొడుకు రవితేజలు. కొడుకు రవితేజకి పెళ్లి సంబంధం కోసం విజయనగరం వెళ్లారు. అక్కడ ఓ రాత్రి ఉండి ఇంటికి మరుసటి రోజు చోడవరం వచ్చారు. విజయనగరంలో ఉంటున్న వారికి కరోనా సోకింది. దీంతో వీరు ముగ్గురు చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ముగ్గురికి పాజిటివ్ లక్షణాలున్నట్లు పరీక్షలలో తేలింది. వీరిని విశాఖలోని కోవిడ్ కేంద్రానికి తరలించారు. వారు అక్కడే చికిత్స పొంది నేడు డిశ్చార్జ్ అయ్యారు. వారి చికిత్సానుభవం గురించి వివరించారిలా...

కొవిడ్ కేంద్రంలో బాగా చూసుకున్నారని పూసర్ల సతీష్ తెలిపాడు. భోజనాలు, టిఫిన్లు బాగానే ఉన్నాయని పేర్కొన్నారు.

అందరూ చెబుతున్నట్లుగా అక్కడేమి దుర్భర పరిస్థితులు లేవు. అవిరి పీల్చడం, సీ మిటమిన్ , బీ క్లాంపెక్స్ మాత్రలు ఇచ్చారు. వైద్యులు దూరం నుంచే ఏలాగున్నారంటూ అడిగి వెళ్లిపోయేవారు. ఆరోగ్యం బాగా లేకపోతే వేరే పరీక్షలు జరిపేవారు. పరిశుభ్రంపై కొద్ది దృష్టి పెడితే మరింత బాగుంటుంది. మాకు శుక్రవారం టెస్టులు చేశారు. అంతా బాగుండటంతో డిశ్చార్జ్​ చేశారు. కరోనా గురించి భయపడాల్సినవసరం లేదు. ఆత్మస్థైర్యం అవసరం - పూసర్ల సతీష్

"వెళ్లేటప్పుడు దిగాలుతో దీనంగా వెళ్లాం. ఇప్పుడు ఆరోగ్యంతో ప్రభుత్వమిచ్చిన ధృువపత్రంతో వచ్చాం. చాలా ఆనందంగా ఉంది". - పద్మ

ఇదీ చదవండి హిందూస్తాన్ స్కౌట్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ముఖ్యకేంద్రం ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.