ETV Bharat / state

వాల్తేర్ డివిజన్ : అన్ని స్టేష‌న్ల‌లోనూ థర్మ‌ల్ స్క్రీనింగ్ త‌ప్ప‌నిస‌రి - Waltair Division

కొవిడ్ కేసుల పెరుగుద‌ల దృష్ట్యా రైల్వే ఆరోగ్య నిబంధ‌న‌ల అమ‌లు మ‌రింత క‌ఠినం చేసింది. వాల్తేర్ డివిజ‌న్ పరిధి అన్ని స్టేష‌న్ల‌లోనూ థర్మ‌ల్ స్క్రీనింగ్ త‌ప్ప‌నిస‌రి చేసింది. మాస్క్ లేకుండా అస‌లు రైల్వే ప్రాంగ‌ణంలోకి ప్ర‌వేశం లేకుండా నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జ‌రిమానా త‌ప్ప‌ని స‌రి చేసింది. ఈ మేర‌కు వాల్తేర్ డివిజ‌న్ కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన నియ‌మ నిబంధ‌న‌ల‌ను మ‌రో మారు ప్ర‌యాణీకుల‌కు తెలియ‌జెప్పేందుకు చర్యలు ముమ్మ‌రం చేసింది.

వాల్తేర్ డివిజన్ : అన్ని స్టేష‌న్ల‌లోనూ ధ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ త‌ప్ప‌నిస‌రి

author img

By

Published : May 7, 2021, 10:54 AM IST

కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే నియమ, నిబంధనలనను మరింత కఠినతరం చేసింది. మాస్క్ లేకపోతే రైల్వే స్టేషన్​లోకి అనుమతిని నిరాకరిస్తామని స్పష్టం చేసింది.

నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి..

బెంగాల్​ సహా ఇత‌ర రాష్ట్రాల నుంచి ఏపీకి వ‌చ్చే వారు 72 గంట‌లకు చెల్లుబాటు అయ్యే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టును త‌ప్ప‌ని స‌రిచేసినట్లు వివ‌రించింది. దూర ప్రాంత ప్ర‌యాణికులు వీటిని దృష్టిలో పెట్టుకోవాల‌ని సూచించింది.

రైలు ఎక్కేటప్పుడు గుమిగూడవద్దు..

స్టేష‌న్లు, రైళ్లలో​ చెల్లుబాటు అయ్యే రిజ‌ర్వ్​డ్ టిక్కెట్లతో ఉండాల‌ని, మాస్క్​లు ధ‌రించాల‌ని, రిజ‌ర్వేష‌న్ కౌంట‌ర్లు, రైలు ఎక్కేట‌ప్పుడు గుమిగూడి ఉండ‌రాద‌ని స్పష్టం చేసింది. భౌతిక దూరం పాటించ‌డం, ఆరోగ్య నియ‌మావళి త‌నిఖీ కోసం రైల్వే సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

పలు రైళ్లు రద్దు..

విశాఖ‌-కిరండ‌ల్, భువ‌నేశ్వ‌ర్-జ‌గ‌ద‌ల్​పూర్, తిరుప‌తి-విశాఖ డ‌బుల్ డెక్క‌ర్, సికింద్రాబాద్- విశాఖ, విశాఖ‌-రాయ‌పూర్, సంబ‌ల్​పూర్- రాయ‌గ‌డ రైళ్ల‌ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ర‌ద్దు చేశామని వివ‌రించింది.

ఇవీ చూడండి : పోలవరంతో తెలంగాణలో ముంపు ఉండదు.. ఏపీ స్పష్టీకరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.