ETV Bharat / state

తాండవ జలాశయం నుంచి నీటి విడుదల

author img

By

Published : Aug 18, 2020, 10:56 AM IST

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి విశాఖ జిల్లాలోని తాండవ జలాశయ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

The water level of Thandava Reservoir in Visakhapatnam district has reached dangerous levels
తాండవ జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల

విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయంలోని నీటి నిల్వలు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో... జలాశయం గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా... సోమవారం సాయంత్రానికి 379 అడుగులకు చేరింది. జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమై నీటిని దిగువకు విడుదల చేశారు.

ఇటీవల కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్​కు ఎగువ ప్రాంతం నుంచి నీటి నిల్వలు ఉద్ధృతంగా చేరడంతో... ముందస్తుగానే స్పిల్ వే రెగ్యులేటర్ మూడు గేట్ల నుంచి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఈ జలాశయం కింద విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో సుమారు 52 వేల ఎకరాల భూమి ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్టుగానే ఈ నెల 3న నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఖరీఫ్ సీజన్​కు సంబంధించి జలాశయం నీటిని విడుదల చేశారు.

ఇవీ చదవండి: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. వరద ముంచెత్తుతోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.