రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు.. విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి ప్రస్తుతం 125 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. జలాశయం పూర్తి నీటిమట్టం.. 137 మీటర్లు కాగా, 136.90 మీటర్లకు చేరుకుంది. అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు స్పిల్ వే గేట్లు ఎత్తారు.
పెద్దేరు నదిలోకి 300 క్యూసెక్కుల వరదనీటిని విడిచి పెడుతున్నట్లు ఇరిగేషన్ ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. దిగువ పెద్దేరు నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ దిగొద్దని హెచ్చరికలు జారీ చేశారు. జలాశయంలోకి ఎగువ నుంచి వస్తున్న వరదనీరు పెరిగితే.. మరింత అదనపు నీటిని నదిలోకి విడిచిపెట్టే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి:
సముద్రంలో బోటు గల్లంతు.. కోస్ట్‌గార్డ్ సాయంతో క్షేమంగా తిరిగి ఒడ్డుకు..!