ETV Bharat / state

'వారం రోజుల్లో ఖాళీ చేయాలి' - కేతిరెడ్డి గుర్రాల కోటకు నోటీసులు - NOTICES TO KETHIREDDY FAMILY

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలను నిగ్గుతేల్చడానికి సిద్ధమైన అధికారులు

Notices_to_Kethireddy_Family
Notices to Kethireddy Family (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 10:10 PM IST

Notices to Kethireddy Venkatarami Reddy Family: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలను అధికారులు నిగ్గుతేల్చడానికి సిద్ధమయ్యారు. చెరువును ఆక్రమించి గుర్రాల కోట నిర్మించి, తోట సాగు చేస్తున్నట్లు గతంలో ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు వరుస కథనాలు ప్రసారం చేసింది. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ధర్మవరం శక్తివడియార్ చెరువును చెరపట్టిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలు నిగ్గుతేల్చుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.

చెరువు భూమి, అక్రమ నిర్మాణాలను నిగ్గు తేల్చడానికి రెవెన్యూ, చిన్ననీటి పారుదలశాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నోటీసులు ఇచ్చారు. ఆక్రమిత భూములను బినామీ పేర్లతో రికార్డులు సృష్టించిన వైనంపై రికార్డులు వెలికితీసిన అధికారులు, బినామీదారులకు కూడా నోటీసులు ఇచ్చారు. ప్రకృతి సిద్ధమైన నీటి వనరులు ఆక్రమిస్తున్నారని గత వైఎస్సార్సీపీలో ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోని అధికారులు, ప్రభుత్వం మారగానే చెరువును ఆక్రమించారంటూ నోటీసులిచ్చారు.

Notices_to_Kethireddy_Family
Notices to Kethireddy Family (ETV Bharat)

"నన్ను ఎవరూ ఏం చేయలేరు!" 20 ఎకరాలు ఆక్రమించేశాడు - దారిని కూడా దున్నేశాడు

వారం రోజుల్లో ఖాళీ చేయాలి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను చంద్రబాబు సర్కారు ఒక్కొక్కటిగా వెలికితీస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలను నిగ్గుతేల్చడానికి సిద్ధమయ్యారు. చెరువు భూమిని ఆక్రమించారని, వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చెరువు భూములను ఆక్రమించి బినామీలుగా బంధువులు, అనుచరుల పేర్లతో రికార్డులు సృష్టించారనే ఆరోపణలు వచ్చాయి.

ధర్మవరం మండలంలోని శక్తివడియార్ చెరువు, దాని పరీవాహక ప్రాంత భూమికి సంబంధించి దశాబ్దాలనాటి రికార్డులను అధికారులు బయటకు తీస్తున్నారు. ఈ చెరువుకు సంబంధించి సర్వే నెంబర్ 908లో 9.30 ఎకరాలు, 909 సర్వే నెంబర్​లో 7.90 ఎకరాలు, 910లో 2.50, సర్వే నెంబర్ 661-1లో 0.91 సెంట్లను ఆక్రమించారని గాలి వసుమతి, తదితరులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆక్రమిత భూమి వివరాలను సమగ్రంగా నోటీసులో చూపుతూ 20.61 ఎకరాల భూమిని వారం రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. నోటీసులు నేరుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి చిరునామాకు పంపించారు.

"జేసీకి తప్పుడు నివేదికలు" - ఆ జిల్లాలో భూఅక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు

ఎన్ని ఫిర్యాదులు చేసినా నాడు పట్టించుకోలేదు: అయితే ఆ సమయంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి ఇంట్లో లేకపోవడంతో, వెంకట్రామిరెడ్డి పీఏ ముకేష్ నోటీసులు తీసుకున్నారు. చెరువుతో పాటు చుట్టూ పరీవాహక ప్రాంతంలోని నీటిపారుదలశాఖతో పాటు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని నోటీసులో చూపించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెరువును ఆక్రమించారని గతంలో జంగా రమేష్ అనే సామాజిక వేత్త అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పట్టించుకోలేదు.

అధికారుల అవినీతిని, అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆక్రమణలను ఎండగడుతూ రమేష్ హరిత ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు. హరిత ట్రైబ్యునల్​లో కేసు విషయాన్ని కూడా తహసీల్దార్ నోటీసులో చెప్పుకొచ్చారు. గుర్రాలకోటను బద్దలు కొట్టి, భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమాయత్తం అవుతున్నారు. దీంతో ధర్మవరం ప్రజలు, చెరువు ఆయకట్టు రైతులకు నారా లోకేశ్ ఇచ్చిన హామీ నెరవేరనుందని స్థానికులు చెబుతున్నారు.

భూ కబ్జా చేశారో అంతే సంగతులు - కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.