ఎంతో మంది జీవితాలను చెడగొడుతున్న నాటుసారాపై విశాఖ మన్యంలో గిరిజన యువత యువత కన్నెర్ర చేశారు. పాడేరు మండలం గురుపల్లి గ్రామంలోని యువత సమీపంలోని కొండ ప్రాంతాల్లో నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. చాలా ఏళ్లుగా వారికి సమస్యగా పరిణమిస్తున్న నాటుసారాను పారదోలేందుకు వీరంతా కలిసికట్టుగా ముందుకు నడిచారు. తయారు చేసిన సారా ఊటను గ్రామంలోకి తీసుకొచ్చి పారబోశారు. అనంతరం డ్రమ్ములు తగలబెట్టారు.
ఇదీ చూడండి: పోలీసుల తనిఖీల్లో... 200 లీటర్ల నాటుసారా పట్టివేత