పెరిగిన ఎండ తీవ్రత కారణంగా విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో వడగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన రహదారులు జనాలు లేక బోసిపోయాయి. ఎండకు ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తమయ్యారు.
ఇది చదవండి విశాఖ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం