G20 Summit in Visakhapatnam : ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం జీ20 సదస్సు విశాఖలో ఆరంభమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ సదస్సు జరుగుతోంది. కేవలం విదేశీ అతిథులు, నిర్దేశిత అధికార్లు మినహా ఇతరులను సదస్సులోకి అనుమతించడం లేదు. రెండు రోజుల పాటు మొత్తం ఏడు సెషన్స్ లో ఈ చర్చలు జరగనున్నాయి. నగరాలను ఆర్థిక వృద్ధికి కేంద్రాలుగా చేయడం, పట్టణ మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహాయమందేలా చర్యలు, పట్టణాలకు ఎదిగేందుకు సిద్ధంగా ఉన్న వాటికి మౌలిక సదుపాయాలను కల్పించే అంశాలపై జీ20 తొలిరోజు చర్చలు ప్రధానంగా జరిగాయి. భవిష్యత్ నగరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, మౌలిక సదుపాయాల ఆర్థిక వనరుల అంతరాన్ని పరిష్కరించడానికి ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడి పైనా చర్చలు జరిగాయి.
నగరాలను ఆర్థిక వృద్ధికి కేంద్రాలుగా చేయడం, పట్టణ మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహాయమందేలా చర్యలు, పట్టణాలకు ఎదిగేందుకు సిద్ధంగా ఉన్న వాటికి మౌలిక సదుపాయాలను కల్పించే అంశాలపై జీ20 తొలిరోజు చర్చలు ప్రధానంగా జరిగాయి. భవిష్యత్ నగరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, మౌలిక సదుపాయాల ఆర్థిక వనరుల అంతరాన్ని పరిష్కరించడానికి ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడి పైనా చర్చలు జరిగాయి.
14 దేశాల నుంచి 57 మంది ప్రతినిధులు.. ఎనిమిది అతిథి దేశాలు, 10 అంతర్జాతీయ సంస్థల నుంచి హాజరైన ప్రతినిధులతో రేపటి నగరాలకు ఆర్థిక సాయం అన్న అంశంపై తొలిరోజు జీ20 సదస్సులో చర్చలు జరిగాయి. 14 దేశాల నుంచి 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. నగరాలకు ఆర్థిక వనరుల అందుబాటు అన్న అంశంతోనే సుస్థిర అభివృద్ధి అన్నదే ప్రధాన ఎజెండాగా ఈ చర్చలు సాగాయి. నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, పట్టణీకరణకు ఆర్థిక వనరుల లభ్యత అంతరాన్ని పూర్తి చేసేందుకు చర్యలపైనే దృష్టి పెట్టేవిధంగా వివిధ నమూనాలపై చర్చించారు. యూఎన్డీపీ, ఓఈసీడీ, ఐఎంఎఫ్, ఏడీబీ, ఈబీఆర్డీ, మెక్సికో లోని స్టాటిస్టిక్స్, జియోగ్రఫీ జాతీయ సంస్థ(ఐఎన్ఈజీఐ), యూకై నేషనల్ స్టాటిస్టిక్స్ కార్యాలయాల నుంచి హాజరైన ప్రతినిధులు ఈ ప్రత్యేక చర్యలపై నిర్ధిష్ట అనుభవాలను పంచుకున్నారు.
రాష్ట్రం సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించేలా.. మౌలిక సదుపాయాల వర్గీకరణపై అంతర్జాతీయ సంస్థల రౌండ్ టేబుల్ ను కూడా ఈ సమావేశంలో పూర్తి చేశారు. 13 మంది అంతర్జాతీయ నిపుణులు మెరుగైన డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో మౌలిక సదుపాయాల నిర్వచనాలు, వర్గీకరణల పాత్ర పై చర్చించారు. ప్రతినిధులకు “రాత్రి భోజ్ పర్ సంవాద్’ (విందుతో సంభాషణ) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించే విధంగా ప్రదర్శనలు, రాష్ట్ర వంటకాల రుచులను ఏర్పాటు చేశారు. రెండో రోజు, బీచ్ ఫ్రంట్‌లో ప్రతినిధుల కోసం 'ఆరోగ్య తిరోగమనం' ఏర్పాటు చేశారు. ఈ ప్రతినిధులకు యోగా, ధ్యానం, సాత్విక ఆహారాన్ని పరిచయం చేయనున్నారు.
ఇవీ చదవండి :