విశాఖ జిల్లా కె.కోటపాడు మండలంలో స్థానిక వైకాపా నేతలు పాదయాత్ర చేశారు. ప్రజా సంకల్పయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలలో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడుతో పాటు జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు, కార్యకర్తలు జోగన్నపాలెం వరకు నడిచారు.
అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించి, ప్రజలకు అండగా నిలిచిందని బూడి ముత్యాలనాయుడు అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. వర్షం పడుతున్నా మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: